Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
నవతెలంగాణ-సుబేదారి
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండలోని సమాఖ్య కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్‌రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్డి, వైశ్య కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయాలని, ఆర్డినెన్స్ జారీ చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆకాంక్షించారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 14న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని, అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ హామీలకు అనుగుణంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే రెడ్డి, వైశ్య కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగవరపు రామకష్ణ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు బోయినపల్లి పాపారావు, నల్లా రాజిరెడ్డి, నాయకులు గంగిడి ప్రభాకర్‌రెడ్డి, ముదిగంటి వెంకట్‌రెడ్డి, కోరల్ల ప్రభాకర్‌రెడ్డి, బండి నర్సింహారెడ్డి, కొలగూరి రాజేశ్వర్‌రావు, చందుపట్ల రాజిరెడ్డి, దుబ్బా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.