Authorization
Sun March 09, 2025 01:14:19 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలోని గోపాల పురం గ్రామానికి చెందిన బోబ్బా సుస్మిత నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ లో సీటు సాధించింది. గ్రామానికి చెందిన గీత-సురేందర్‌రెడ్డి మోతే మండలంలోని రాఘవాపురంలో చిన్న హోటల్ నడుపుతూ కూతురును చదివించారు. సునీత 720కిగాను 576 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 1286 ర్యాంక్ సాధించింది. విద్యార్థినికి తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు. కోర్సు పూర్తి చేసి పేదలకు వైద్యం చేయడమే ధ్యేయమని సుస్మిత చెప్పారు.