Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామెర
మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలు పశువులకు వివిధ రకాల వ్యాధులకు సంబంధించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ దీపిక మాట్లాడారు. పశుపోషకులు, రైతులు శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. గ్రామంలో పశువులకు చికిత్స అందించేందుకు పశుమిత్ర సరిత అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పుల్యాల రాణి, రఘుపతిరెడ్డి, వీఎల్ఓ లక్ష్మణ్, జీవీఓ రవి, శంకర్, కారోబార్ రాజు, ఏపీఎం ఝాన్సీ, సీసీ మాధవి, తదితరులు పాల్గొన్నారు.