Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గంగారం
మండలంలోని దళిత కులానికి చెందిన పేదలందరికీ దళితబంధు పథ కాన్ని వర్తింప జేయాలని ఎమ్మా ర్పీఎస్ మండల అధ్యక్షుడు ధార చిరంజీవి, మెంతికి యాకయ్య కోరారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లుకు, తహసీల్దార్ సూర్యనారాయణకు మంగళవారం మెమోరాండం అందజేశారు. అనంతరం చిరంజీవి, యాకయ్య మాట్లాడారు. మండలంలో 60 దళిత కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మహేష్, సురేష్, పద్మ, పుష్ప, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.