Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన గీత కార్మికుడు బుర్ర కనకయ్య ఇటీవల మృతి చెందగా అతడి కుటుంబానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం 50 కేజీల బియ్యం, వెయ్యి రూపాయల నగదు సాయం అందించారు. తొలుత బీజేపీ అనుబంధ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, మండల ఇన్చార్జి తాటి కృష్ణతో కలిసి కనకయ్య కుటుంబాన్ని భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. కనకయ్య మృతి బాధాకరమన్నారు. అతడి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లెల రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కొండూరి నరేష్, అల్లే జనార్ధన్, జిల్లా అధికార ప్రతినిధి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా హన్మంతరెడ్డి, దళిత మైనార్టీ మోర్చాల జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, తదితరులు పాల్గొన్నారు.