Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రభుత్వ నిషేధిత అక్రమ గుట్కా,అంబర్ యథేచ్ఛగా విక్రయిస్తున్న సదరు వ్యాపారి దుకాణంపై టాస్క్‌ఫోర్స్ సీఐ వాసుదేవరావు ఆధ్యర్యంలో దాడులు చేసి సుమారు రూ.70వేల విలువైన గుట్కా పట్టుకున్న సంఘటన మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం... పెద్దతూండ్ల గ్రామంలోని గుట్కా వ్యాపారి రెవెళ్ళి సంతోష్ దుకాణంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిం చారు. గుట్కా, అంబర్, పాన్ మసాలా స్వాధీనం చేసుకొని నిందితుడు సంతోష్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కొయ్యుర్ పోలిస్ స్టేషన్ కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామకష్ణ, ఏఎస్ఐ అమరేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, కానిస్టేబుల్ శ్రీనాథ్ పాల్గొన్నారు..