Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీకెఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు
నవతెలంగాణ-భూపాలపల్లి
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఉపాధి పనులకు రెండు లక్షల కోట్లు కేటాయిం చాలని, 200 రోజులు పని దినములు కల్పించాలని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్ రాములు డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్ రాములు పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఏఒక్కటి పాలకులు నెరవేర్చలేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉపాధి పనులకు నిధులు తగ్గించి నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదన్నారు. ఉపాధి కూలి రోజుకు రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, స్థలాలు ఉన్నవారికి ఆరు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలన్నారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మామిడాల సమ్మిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరుమాల రాజయ్య, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కె.వెంకటేష్ ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కుమ్మరి బాబు, కొమురయ్య, బిక్షపతి, కర్ణాకర్ ,ప్రశాంత్ పాల్గొన్నారు.