Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం చిన్నఓదాల గ్రామంలోని మానేరులో ఇసుక క్వారీకి అనుమతులు పొంది భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామం పంట పొలాల మీదుగా ఇసుక రవాణ చేయెద్దని మల్లారం గ్రామ రైతులు మంగళవారం పంట పొలాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ఇసుకను తరలించడం ద్వారా తమ పంట పొలాలు, అంతర్గత రోడ్లు దెబ్బతినడమే కాక భవిష్యత్తులో బారీగా సాగు,తాగు నీటి ఎద్దడి, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో క్వారీ నిర్వహించి భూపాలపల్లి జిల్లాలో ఇసుక రవాణాకు అధికా రులు ఎలా అనుమతులు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అడ్డు అదుపు లేని ఇసుక క్వారీలు నిర్వ హించడం ద్వారా రానున్న వేసవిలో మండల ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తే ప్రమా దం పొంచి ఉందన్నారు. ఇసుక రవాణకు అనుమతులు రద్దు చేయాలని కోరారు. గుత్తేదారు ఇసుక రవాణా ప్రయత్నాన్ని విరమించుకోవాలని, లేదంటే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు గోనే లింగారావు, లింగన్నపేట మురళి, రేవెల్లి లింగయ్య, రమేష్‌రావు, సంపత్‌రావు, స్వామిరావు, ఆనంద రావు, సమ్మయ్య, రాజేశ్వర్‌రావు, ఉపేందర్‌రావు, నర్సింగరావు, గడ్డం సదయ్య తదితరులు పాల్గొన్నారు.