Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొలం రాజేందర్
నవతెలంగాణ-పలిమెల
కిష్టాపూర్ గ్రామంలోని ఆదివాసీల గుడిసెలను తొలగించేది లేదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొలం రాజేందర్ అన్నారు. మంగళవారం పలిమెల మండల పరిధి కిష్టాపూర్ గ్రామంలోని ఆదివాసీ గుడిసెలను కొన్నింటిని ఫారెస్ట్ అధికారులు కూల్చేశారు. విషయం తెలుసుకున్న ఆయన బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. సుమారు 20 ఏండ్లుగా పోరాటం చేస్తూ నాలుగేండ్లుగా వ్యవసాయం చేసుకుంటూ ఆదివాసీలు జీవనం సాగాస్తున్నారని అన్నారు. ఉన్నట్టుండి వారిని ఖాళీ చేయమనడం తగదని హెచ్చరించారు. మండల రికార్డుల్లో కిష్టాపూర్ గ్రామం ఉన్నదని, గ్రామం శివారు సుమారు 2200 ఎకరాల భూమికి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇంతకుముందు ఇక్కడ నివాసం ఉన్న గ్రామ ప్రజలు జీవనోపాధి లేక వ్యాధుల బారిన పడ,ి మంచినీటి సౌకర్యం లేక గిరిగూడెం, వెచంపల్లే, నీలంపల్లి వివిధ గ్రామాలకు వెల్లి నివసిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంత మూడు గ్రామాల్లో ఎలాంటి ఉపాధి లేక తిరిగి కిష్టాపూర్ గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటు న్నారని తెలిపారు. అధికారులు వచ్చి ఖాళీ చేయమనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షులు సూదుల శంకర్, మహాముత్తారం మండల కార్యదర్శి కుమార్ , తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సకినాల మల్లయ్య రైతు సంఘం మండల కార్యదర్శి బీరపూరి తిరుపతి పాల్గొన్నారు.