Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియా మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్/మట్టెవాడ
డివిజన్లలోని సమస్యల సత్వర పరిష్కారినికే నగర బాట కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం 25,27,28,29,31 డివిజన్లలో ఏర్పాటు చేసిన నగర బాట కార్యక్రమంలో కమిషనర్ పి ప్రావీణ్య,ఆయాడివిజన్ల కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మేయర్ పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 25వ డివిజన్ లోని ఎల్లం బజార్ మార్కెట్ లో పర్యటించి మార్కెట్‌ను మోడల్ మార్కెట్ గా తీర్చి దిద్దడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. 31వ డివిజన్లోని శాయంపేట, సుర్జీత్‌నగర్ ప్రాం తాల్లో పర్యటించారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక కమ్యూనిటీహాల్ మమరమ్మతులకు కార్పొరేటర్ బస్వరాజు శిరీష మేయర్ , కమిషనర్ దృష్టికి తీసుకురాగా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. 27 వ డివిజన్ గోవింద రాజుల గుట్ట సమీపంలోని ముదిరాజ్‌వాడ, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో మంజూరైన అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల న్నారు. మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన మంచి నీరు అందేలా చూడాలని, ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్పొరేటర్ చింతకుల అనిల్ కుమార్ సహకారంతో స్థానిక ప్రజలకు పారిశుధ్యంపై వివరించాలని ఆదేశించారు. 28 వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీ, బృందావన్ కాలనీ, సంతోషి మాత కాలనీలో సైడ్ డ్రైయిన్లు ఏర్పాటు చేయడంతోపాటు, ఎన్టీఆర్ కాలనీలోని రెండు ప్రభుత్వ భూముల ఖాళీ స్థలాలకు ప్రహరీ ఏర్పాటు చేయాలన్నారు. సంతోషి మాత కాలనీ లో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. 29 వ డివిజన్ రామన్న పేట ప్రాంతంలో జగ్జీవన్ రామ్ మున్సిపల్ కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు నిధులు మంజూరయ్యాయని రీ డిజైన్ తయారు చేయాలని కోరారురు. ఓఏస్నగర్లో సైడ్ డ్రైనేజీలు, అంతర్గత రోడ్ల తదితర వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బస్వరాజు శిరీష శ్రీమాన్, చింతాకుల అనిల్ కుమార్, మామిళ్ల రాజు, సీఎం హెచ్‌వో రాజారెడ్డి, సీహెచ్ఓ సునిత, సిటీ ప్లానర్ వెంకన్న, డీఎఫ్ఓ కిషోర్, హెచ్ఓ.ప్రిసిల్లా, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్ యాదవ్ , డీసీపీ ప్రకాష్ రెడ్డి, ఈఈలు బిఎల్ శ్రీనివాసరావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .