Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో స్పెషల్ అఫికారి సంచాలకులు శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి ముంజ మహేష్ యాదవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.సరైన పత్రాలు లేని 130 బస్తాల యూరియా, 40 బస్తాల కాంప్లెక్స్ అమ్మకం నిలిపివేసినట్లు ఏవో తెలిపారు. గ్రామంలోని జ్యోతి సాయి పెర్టిలైజర్, వేంకటేశ్వర ఫెర్టిలైజర్, సంతోష సాయి ఫెర్టిలైజర్ దుణాల్లో తనిఖీ నిర్వహించగా ఇన్వాయిస్ లేని 130 బస్తాలు యూరియా, 40 బస్తాల కాంప్లెక్స్ అమ్మకం నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. వీరిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలు మండలంలో మరో రెండు రోజులు కొనసాగుతాయని వివరించారు.