Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
మానవ అక్రమ రవాణా నిరోధించాలని స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఫ్లోరెన్స్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మానవ అక్రమ రవాణాపై అంగన్వాడీ కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఫ్లోరెన్స్ మాటాడారు. నేటి సమాజం లో జరుగుతున్న అరాచకాలను అరికట్టడం లో అంగన్వాడీ టీచర్స్ కృషి చేయాలన్నారు. వ్యక్తుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని కొందరు మోసం చేసి పెద్ద పట్టణాల్లో వ్యభిచారకూపంలో అమ్మి డబ్బు సంపాదిస్తున్నారన్నారు. ముఖ్యంగా బాలికలు, ఒంటరి మహిళలే ఈ సమస్యల్లో చిక్కుకుటున్నారని అన్నారు. ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సరస్వతి, పజ్వాల సిబ్బంది సురేష్, రఫీ, శిరీష, లావణ్య ఆండ్ వివిధ మండలాల పరిధిలో అంగన్వాడీ టీచర్స్ శారద, మంజుల, కళావతి, తదితరులు పాల్గొన్నారు.