Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
మాసవారి తనిఖీల్లో భాగంగా జనగామలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా కలెక్టర్ తాళం వేసి ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. కెమెరా పనితీరును పరిశీలిం చారు. అనంతరం రిజిస్టర్ లో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈవీఎం గోదాం భద్రతలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తపై పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మధు మోహన్, ఎన్నికల విభాగం సిబ్బంది ఉన్నారు.