Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో కవరేజికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై గాయపడ్డ మండలంలోని రాజుపేటకు చెందిన విలేకరి జానపట్ల జయరాజ్‌కు రాజుపేటకు చెందిన పారిశ్రామికవేత్త, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు యడ్లపెల్లి నర్సింహారావు 25 కేజీల బియ్యం, నగదు అందజేశారు. సోమవారం మండల పార్టీ శ్రేణులతో జయరాజును పరామర్శించిన నర్సింహారావు ప్రమాదం జరిగిన తీరుపై అడిగి తెలుసుకున్నారు. మేడారం జాతర ముగింపు రోజు ఇంటికి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢ కొట్టడంతో జయరాజు మోకాలు ఫ్య్రాక్చర్ అయినట్లు తెలిపారు. త్వరగా కోలుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయ కులు గుండేటి రాజు, చదలవాడ సాంబశివ రావు, రాయా సాహెబ్, పేరయ్య, నిమ్మగడ్డ ప్రవీణ్ కుమార్, వీరస్వామి పాల్గొన్నారు.