Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి
నవతెలంగాణ-సుబేదారి
డిజిటల్ ఫైనాన్స్‌పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి కోరారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లోనిమినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మార్పు విద్యార్థులు, ప్రజల నుంచే మొదలౌతుందని చెప్పారు. వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకుని ఇతరులకు అవగాహన కల్పించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. అనంతరం ప్రపంచ వినియోగదారుల దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. డీసీఎస్ఓ కష్ణవేణి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల చట్టం 1986లో ఏర్పడిందని చెప్పారు. జాతీయ కమిషన్ ద్వారా హక్కులను పరిరక్షించుకున్నామని తెలిపారు. సైబర్ నేరాలను, మోసాన్ని అరికట్టడానికి డిజిటల్ యాప్‌ల ద్వారా లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, ఎల్డీఎం మురళీ మోహన్, అనిల్ కుమార్, శ్రీవాసు, షాబుద్దీన్, పురుషోత్తమ్, రతన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.