Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల ప్రత్యేక అధికారి సూర్యనారాయణ
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' కార్యక్రమం చేపట్టిందనిమండల ప్రత్యేక అధికారి సూర్యనారాయణ, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి తెలిపారు. 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు పాఠశాలలో ఎంఈఓ రాముతో కలిసి వారు మండలంలోని మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ, మాధవి మాట్లాడారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి కషి చేయడానికి ప్రభుత్వం మండలంలోని 22 పాఠశాలలను ఎంపిక చేసిందని చెప్పారు. సదరు పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషాద్రి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తొర్రూర్ టౌన్ : మండలంలోని కంఠాయపాలెం, మడిపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మండల ప్రత్యేక అధికారి నర్మదతో కలిసి ఎంపీపీ మంగళవారం సందర్శించారు. ఆయా పాఠశాలల్లో అవసరమైన మౌలిక సౌకర్యాలపై హెచ్ఎంలను ఆరా తీశారు. అనంతరం కంఠాయపాలెం హైస్కూల్లో విద్యార్థులకు ఎంపీపీ కుమారుడు సామేలు సొంత డబ్బులతో పెన్నులు, స్నాక్స్, సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మెన్ సురేందర్‌రెడ్డి, కమిషనర్ గుండె బాబు, నోడల్ హెచ్ఎం తుమ్మ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.