Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సింహులపేట
రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ఒకేసారి అమలు చేయాలని వ్యకాస జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య, కేజీకేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గునిగంటి మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాలులో పొనగంటి యాదగిరి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ప్రజాసంఘాల విస్తతస్థాయి సమావేశానికి వీరయ, మోహన్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను రాష్ట్రంలో పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. దళితులకు, గిరిజనులకు భూపంపిణీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గొర్రెల పెంపకందార్లకు పింఛన్లు, తదితరాలను పూర్తిస్థాయిలో అమలు చేసిన దాఖలాల్లేవని చెప్పారు. రాష్ట్రంలో 1.90 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉండగా కేవలం 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కాయితం వీరయ్య, వ్యకాస జిల్లా కమిటీ సభ్యుడు జక్కుల లింగన్న, రైతు సంఘం జిల్లా నాయకులు యనగండ్ల సోమిరెడ్డి, బానోతు సర్వం, కందుకూరి సుధాకర్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు పొనగంటి యాదగిరి, ఉస్మాన్ అలీ, యనమల రవి, నీలం సత్యం, పగిళ్ల సమ్మయ్య, మిడతపల్లి ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.