Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
ఈనెల 28, 29 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్, హనుమ కొండ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి కోరారు. ఈ మేరకు ఆ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని ములుగు రోడ్డు ఇండిస్టియల్ ఏరియాలోని ఏకే గార్మెంట్స్ యాజమాన్యానికి మంగళవారం సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా రమేష్, సారంగ పాణి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. జాతీయత, దేశభక్తి గురించి ఊదరగొడుతూనే ఆచరణలో విధ్వంసకర విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. జాతీయ సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారాలు మోపుతోందని ధ్వజమెత్తారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను 4 కోడ్లుగా సవరించి మోసపూరితంగా వ్యవహరించిందని చెప్పారు. కార్మికులను, రైతు లను, ఉద్యోగులను, అన్ని తరగతుల ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మె తలపెట్టినట్టు చెప్పారు. సమ్మెకు యాజమాన్యం సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏకే గార్మెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు స్వరూప, కార్యదర్శి రాజేశ్వరి, కోశాధికారి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ మాట్లాడారు. సమ్మెలో కార్మికులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గిరిప్రసాద్, మౌలానా, జడ శ్రీను, రవీందర్, వీరయ్య, యాదగిరి, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.
సమ్మె నోటీస్ అందజేత
ముల్కనూరు పీహెచ్సీ వైద్యాధికారులకు మండలంలోని ఆశావర్కర్లు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కందునూరిశ్రీనివాస్, ఆశావర్కర్ల సంఘం మండల నాయకురాలు రమాదేవి మాట్లాడారు. కార్యక్రమంలో సుజాత, నమ్మి, కౌసల్య, దేవి తదితరులు పాల్గొన్నారు.