Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి
- శిక్షణ పొందిన పశుమిత్రలకు సర్టిఫికెట్లు పంపిణీ
నవతెలంగాణ-ములుగు
జిల్లాలో పశుసంవర్ధక శాఖ అందిస్తున్న ఉచిత పశువైద్య సేవలను పశు పోషకులు, పాడి రైతులు వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో డీఆర్డీఏ, పశువైద్య సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పశుమిత్ర సభ్యులకు బుధవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి మొదటి విడతలో ఐదుగురిని పశుమిత్రలుగా ఎంపిక చేసినట్టు తెలిపారు. డీఆర్డీఓ నాగ పద్మజ మాట్లాడుతూ ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాలకు సంబంధించిన వారికి మూడు నెలల పాటు శిక్షణ ఇప్పించినట్టు చెప్పారు. శిక్షణ పొందిన పశుమిత్రలకు కత్రిమ గర్భధారణ పరికరాలు అందజేసినట్లు జిల్లా పశువైద్య శాఖ అధికారి విజరుభాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి విజయభాస్కర్, సీపీఓ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.