Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రెలను వెంటనే పంపిణీ చేయాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం అశోక్ అన్నారు. మండల కేంద్రంలో సంఘం కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎసల్ల ఎల్లయ్య అధ్యక్షతన అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా అశోక్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం మూడేండ్లుగా అటుకెక్కిందని చెప్పారు. గొల్ల కురుమల ఆర్థిక అబివృద్ధి కోసం గొర్రెల పంపిణీ చేసిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మొదటి విడత గొర్రెల పంపిణీ చేసి మూడేండ్లు గడచినా రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించడం లేరన్నారు. వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా వెంటనే భర్తీ చేసి, గొర్రెలు మేకలకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ సొసైటీ ఎన్నికలు నిర్వహించి సొసైటీల అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం స్టేషన్ సొసైటీ అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, వార్డ్ మెంబర్ నర్సింగం వెంకటేశ్వర్లు, మండల సోషల్ మీడియా బాధ్యులు కన్నబోయిన రామకృష్ణ, మండల కార్యదర్శి పూజారి వెంకటేష్, సహాయ కార్యదర్శి తండా మహేష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.