Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలో ఐదో బెటాలియన్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ములుగు జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ భరోసా ఇచ్చారు. ఆ గ్రామానికి ఆయన బుధవారం వచ్చిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నామ్ రవి స్వాగతం పలికి సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడారు. భూనిర్వాసితుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలు, పార్టీ అభివృద్ధి గురించి నాయకులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఇటీవల ప్రమాదానికి గురైన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రెండ్ల సంతోష్‌ను పరామర్శించారు. చివరగా నామ్ రవి ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మెన్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరపనేని సాయిబాబు, మండల ఇన్‌ఛార్జి, నాయకుడు పోరిక గోవిందు నాయక్, మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నర్సింహనాయక్, అధికార ప్రతినిధి బూరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నాయకులు భూక్యా రాజు, చుక్క గట్టయ్య, ఏనుగుల సాంబశివరావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.