Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
బాలల హక్కులకు భంగం కలిగించొద్దని పసర సర్పంచ్ ముద్దబోయిన రాము కోరారు. మండలంలోని ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోషల్ వర్కర్ ప్రణరుకుమార్ ఆధ్వర్యంలో ఓఆర్డబ్ల్యూ స్వర్ణలత అధ్యక్షతన బుధవారం నిర్వహించిన గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ రాము హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాలల హక్కులకు భంగం కలిగించడం చట్టరీత్యా నేరమన్నారు. బాలికలు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నా సమాజంలో ఇంకా బాల్యవివాహాలు జరుగుతుండడం బాధాకరమన్నారు. కొన్ని ప్రాంతాల్లో బాలకార్మికులు కనిపిస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. అలాగే బాలలపై లైంగిక దాడులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. బాలల హక్కుల పట్ల సమాజంలోని ప్రతిఒక్కరూ అవగాహన పెంచు కోవాలన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి శరత్ బాబు మాట్లాడారు. బాల్యవివాహాలను, బాల కర్మిక వ్యవస్థను, బాలలపై లైంగిక దాడులను అరికట్టడా నికి సమాజం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యు లు అనూష, సురేష్, వీఓ అధ్యక్షురాలు యాస పూలమ్మ, అంగన్వాడీ టీచర్లు పద్మారాణి, భాగ్యమ్మ, సరిత, ఊర్మిళ, సునీత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.