Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు తక్కళ్లపెల్లి
నవతెలంగాణ-రఘునాథపల్లి
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీిఆర్ఎస్ నాటక లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయని, ప్రభుత్వాలకు చరమగీతం తప్పదని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస రావు, జనగామ మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ రాజారెడ్డి అన్నారు. బుధవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో సీపీఐ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పాలన కొనసాగిస్తు న్నాయని అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. భూదాన్ భూములపై దశలవారీగా పోరాటం చేస్తామన్నారు. గ్రామ గ్రామాన సీపీఐ పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల విజయా నికి తోడ్పాడాలని రాజారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కవాటి యాదగిరి, బాల్నే ఉదరు, రమేష్ గౌడ్, సింగారపు నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.