Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు ఈనెల 28, 29న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు కోరారు. మండల కేంద్రంలో ని అన్ని రైస్ మిల్ యాజ మాన్యాలకు బుధవారం సమ్మె నొటీసులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాపర్తి రాజు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అదికారం లొకొచ్చిన నాటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందన్నారు. కార్మికులు పొరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తోందని అన్నారు. రైస్ మిల్లులలో పనిచేస్తున్న హమాలి కార్మికులు రైస్ మిల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారి సంక్షేమానికి హమాలి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. సీఐటీయూ మండల కన్వీనర్ యాతం సమ్మయ్య, యూనియన్ మండల నాయకులు కాట సుధాకర్ నల్లతీగల శ్రీనివాస్, సిద్ధం సోమయ్య, రామచంద్రు, సారంగం, చిరంజీవి సారయ్య, లక్ష్మీ, నర్సయ్య, యాదగిరి పాల్గొన్నారు.