Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
విద్యార్థులు ప్రతిభను కనబరిచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మహాత్మ హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంట రవీందర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో, మండలం లోని విస్నూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఆయా ప్రధానోపాధ్యాయులు బైరపాక నవీన, పెనుగొండ సోమన్న అధ్యక్షతన వేరువేరు కార్యక్రమాలు నిర్వహించారు. విస్నూరు పాఠశాలలో ఎన్ఆర్ఐ దొంతినేని వెంకటేశ్వర రావుతో కలిసి ఆయన మాట్లాడారు. దాతల సహకారంతో పాఠశాలలను అభివద్ధి చేసుకోవాలని సూచించారు. తాగునీటి సౌకర్యం, పంపుసెట్టు ఏర్పాటుకు రూ 10,000 విరాళాన్ని ప్రకటించారు. మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు, ప్రహరీ నిర్మాణానికి తోడ్పాటునందిస్థానని, విద్యావాలం టీర్కు నెల వేతనం అందించేందుకు వెంకటేశ్వరరావు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం బదిలీ ఉపాధ్యాయులు కాంతయ్య, మంజుల, హరిలాల్ రూ.5వేల విలువైన ప్లేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాకయ్య, ఎంపీటీసీ మాటూరి యాకయ్య, పాఠశాల చైర్మన్ పొలాస సోమయ్య, వైస్ చైర్మన్ నాగరాజు, ఉపాధ్యాయులు మాధురి, కవిత, హేమలత పాల్గొన్నారు.