Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ
మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ఎనిమిది గంటలు అయినా పాఠశాల గేటు తీయని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు పాఠశాల గేటు దూకి గ్రౌండ్లో ఆటలు ఆడుకుంటున్నారు. ఇదే విషయమై పాఠశాల ఉపాధ్యాయుడిని వివరణ కోరగా ట్రైన్ లేట్‌గా రావడం వల్ల రాలేకపోయానని చెప్పడం గమనార్హం. పాఠశాల మొత్తం ఉపాధ్యాయులలో ఒకరు మాత్రమే హాజరయ్యారు. మండల కేంద్రంలోనే ఇలా ఉంటే చుట్టుపక్కల గ్రామాలు, తండాల పరిస్థితేంటని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఉపాధ్యాయులు సమయపాలన పాటించ ట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో డీఈఓ సైతం పాఠశాల తనిఖీ చేసి పలువురిని సస్పెన్షన్ చేశారు. అయినా ఉపాధ్యాయులలో మార్పు రాకపోవడం గమనార్హం.