Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్.
నవతెలంగాణ-జనగామ
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు వెంటనే 80039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డీివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక డీవైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాటాడారు. డీవైఎఫ్ఐ పోరాటాల ఫలితంగా ముఖ్యమంత్రి ఉద్యోగ ప్రకటన చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిరుపేద నిరుద్యోగ యువత కోసం ఉచిత స్టడీ సర్కిల్తోపాటు ఉచిత శిక్షణ కేంద్రాలు, భోజన వసతి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. కోచింగ్ సెంటర్ల దోపిడిని అరికట్టాలని, ప్రభుత్వమే ఉచిత శిక్షణ ఇవ్వాలన్నారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఏటా రెండుకోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నేటికి భర్తీ చేయలేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని ప్రయివేటుపరం చేస్తూ ఉన్నా ఉద్యోగాలను ఊడగొ డుతున్నారని అన్నారు. కేంద్రప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నా పోస్టులన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా గుంటి బాలరాజును ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శి దూసరి నాగరాజు ,జిల్లా నాయకులు, ప్రశాంత్, ప్రభాకర్, అర్జున్, సంపత్, రాజుకుమార్, శ్రావణ్, చింటు, లక్కి, రాకేష్, నగేష్, రాజేష్ , అనిల్ పాల్గొన్నారు.