Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పలిమెల
పలిమెల మండల పరిధి కిష్టాపూర్ శివారులో సుమారు 20 ఏండ్లుగా ఆదివాసీలు జీవనం సాగిస్తున్నారు. నాలుగేండ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మండల రికార్డుల్లో కిష్టాపూర్ గ్రామం ఉన్నది. గ్రామం శివారులో సుమారు 2200 ఎకరాల భూమికి ఆధా రాలు ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ నివాసం ఉన్న గ్రామ ప్రజలు జీవనో పాధి లేక వ్యాధుల బారిన పడ,ి మంచినీటి సౌకర్యం లేక గిరిగూడెం, వెచంపల్లే, నీలంపల్లి వివిధ గ్రామాలకు వెల్లి నివసించారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంత మూడు గ్రామాల్లో ఎలాంటి ఉపాధి లేక తిరిగి కిష్టాపూర్ గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఫారెస్ట్ అధికారులు వచ్చి ఖాళీ చేయమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారి గుడిసెలను బ్లేడు బండి ట్రాక్టర్ తో కూలగొట్టి నిలువ నీడ లేకుండా చేశారని బాధితడు భాస్కర్ పేర్కొన్నారు. తాత ముత్తాల నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఇందుకు చెరువులు చింత చెట్లు ఆనవాళ్లు కరూడా ఉన్నాయని తెలిపారు. అయితే ఫారెస్ట్ అధికారులు వచ్చి గుడిసెలను, తాటి చెట్లను తొలగించడం గమనార్హం.