Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే నరసింహమూర్తి అన్నారు. బుధవారం బదిలీపై వెళ్తున్న వెంకటలక్ష్మి, ప్రేమలత, మౌనికను సన్మానించారు. నూతనంగా వచ్చిన పాఠశాల ప్రధానో పాధ్యాయుడు విద్యాసాగర్, ఆర్ భాస్కర్, చంద్రమౌళిని ఆహ్వానించి సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని వారు అన్నారు. ఎక్కడ ఉన్నా మంచి పేరు తెచ్చుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మెన్ కిరణ్, అచ్చ సుదర్శన్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.