Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరురి కుమార్
నవతెలంగాణ-జనగామ
దళితబంధు పథకం ఎంపికలో మంత్రులు ఎమ్మెల్యేల జోక్యాన్ని ప్రతిఘటించాలని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరురి కుమార్ పిలుపు నిచ్చారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు తోటి దేవదానం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అరురి కుమార్ పాల్గొని మాట్లా డుతూ.... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకం అర్హులైన దళితులకు కాకుండా మంత్రులు ఎమ్మెల్యే రాజకీయ జోక్యంతో టటీఆర్ఎస్ కార్య కర్తల ఫలహారంగా పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. దానిని ప్రతిఘటించి దళితులందరికి దళితబంధు ఇవ్వాలని కేవీపీఎస్ దశల వారి పోరా టాలను నిర్వహిస్తున్నదన్నారు. రాష్ట్రంలో దళితులం దరికి ఇవ్వటానికి ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితి పెట్టాలన్నారు. కేవలం రూ.17,700 కోట్లతో 18 లక్షల కుటుంబాలకు దళితబంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తక్షణమే కనీసం రూ.30వేలకోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పథకం ప్రకారమే దళితుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు మహిళలపై హింస పెరిగిం దన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపు కుంటుందన్నారు. లౌకిక శక్తుల ఐక్యత దేశానికి తక్షణ అవసరంగా ఉందన్నారు. గ్రామగ్రామాన కేవీపీఎస్ దళిత యువతను సమీకరించి దశాలవారి ఆందోళన పోరాటాలు నిర్వహిసున్నదన్నారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల లలిత, జిల్లా నాయకులు బొట్ల శ్రవణ్, గడ్డం యాదగిరి, శాగా సంబరాజు, ప్రభాకర్, ఉప్పలయ్య, చక్రపాణి,అనిత, రామ, శోభ, శాంతమ్మ, శిరీష పాల్గొన్నారు.