Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధుల కేటాయింపుపై స్పష్టత కరువు
- ఎలా సర్దుబాటు చేస్తారో తెల్సని వైనం
నవతెలంగాణ-మల్హర్రావు
గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో)ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. వారికి విధుల కేటాయింపుపై ఇప్పటికి స్పష్టత కరువైయింది. ఏడాదిన్నర క్రితం 2020 సెప్టెంబర్లో వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయా పోస్టుల్లో ఉన్న ఉద్యోగుల్లో ఇప్పటికి నిర్దిష్టమైన విధులను ప్రభుత్వం కేటాయించలేదు. తహసీల్ధార్ కార్యాలయంలోనే ఖాళీగా కోర్చోబెడుతున్నారు. జిల్లాలో 138,మండలంలో 12మంది విఆర్వోలు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిపోతున్నారు. వారికి ఎలాంటి విధులు లేకపోవడంతో ఖాళీగా కూర్చున్నారు.
కొత్త జోన్ల ఏర్పాటుతో ఉద్యోగ విభజన జరిగిన వీఆర్వోలను మాత్రం బదిలీలు చేయలేదు. మరోవైపు ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది.రెవెన్యూశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని ప్రసకటించింది.అయినప్పటికీ వీఆర్వోలుగా పని చేసిన ఉద్యోగులకు ఎలాంటి బాధ్యతలను అప్పగించకుండా వారిని ఖాళీగా ఉంచడం వలన ప్రయోజనం ఏమి టనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన సమయంలో వీఆర్వోలు సహకార సంఘాలుగానీ రైస్ మిల్లులో ధాన్యం లెక్కలు చూశారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ రెండు నెలల్లో ముగిసిపోగా మిగతా రోజుల్లో ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నారు. నెలనెలా జీతాలు ఇస్తున్న సరైన పనిలేక వీఆర్వోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు బాధ్యతలు కేటాయించాలని కోరుతున్నారు. వివిధ శాఖల్లో వీఆర్ఓలను సర్దుబాటు చేయనున్నట్లు ప్రచారం.
ఆదేశాలు అందే వరకు అంతే: తహసీల్ధార్ శ్రీనివాస్
వీఆర్వోల అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందే వరకు వారికి నిర్దిష్టమైన పని కల్పించడం సాధ్యం కాదు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తేనే వీఆర్వోలకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది.