Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలిమెల : సమ్మక్క-సారలమ్మ వనదేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సూధుల శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో చిన్నజీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సంద ర్భంగా సంఘం నాయకులు కొవ్వూరి కిష్ట్టయ్య, పెద్దిరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. దొంగ స్వాములు, దొంగబాబాలు అబద్ధపు ప్రచారాలు చేయడం మనువాధులకే చెల్లుతాయని ఎద్దేవా చేశారు, చినజీయర్ స్వామి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పెద్ది రాజు, కొవ్వూరి కిష్టయ్య, పెద్ది శేఖర్, కాపుల సురేష్,పెద్ది బక్కయ్య,పెద్ది సాంబయ్య, సంజీవ్, అశోక్, .రమేష్ తదితరులు ఉన్నారు.