Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మండల కేంద్రంలోని పీహెచ్సీని శుక్రవారం ఢిల్లీ వైద్య బందం పరిశీలించింది. జాతీయ ఉత్తమ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా గణపురం ఆరోగ్య కేంద్రం ప్రతిపాదించగా ఢిల్లీ వైద్య బృందం డాక్టర్ గాయత్రి, డాక్టర రాకేష్ ఖన్నాన్ పరిశీలించారు. ఆరు రకాల విభాగాలను పరిశీలించారు. సహజ కాన్పులు, వారికి లభించే సేవలు, జాతీయ కార్యక్రమాల వివరాలు తెలుసు కున్నారు. ఈ కార్యక్రమం రెండు రోజులు ఉండగా, మొదటి రోజు డీఎంహెచ్ఓ శ్రీరామ్ వివరాలు తెలిపారు. దీంతో ఢిల్లీ బందం మార్కులు వేసి, జాతీయ ఉత్త మ నాణ్యత ప్రమాణాలకు పంపిస్తారని తెలిపారు. ఇందులో మంచి మార్కులు వస్తే, జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూ టీ డీఎంహెచ్ఓ కొమురయ్య, ప్రోగ్రాం అఫిసర్స్ డాక్టర్ శ్రీదేవి ,ప్రోగ్రాం ఆఫీసర్ డీడీఓ డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ విజయ కష్ణ, డాక్టర్ సంపత్ పాల్గొన్నారు.