Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్యం సీసాతో గులాబీ ఎమ్మెల్యే హల్చల్ హోలీ వేడుకల్లో..
నవతెలంగాణ-మహబూబాబాద్
స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ నిత్యం సంచలన వార్తల్లో ఉంటున్నారు. కావాలనా లేక తెలియక చేస్తారా లేదా ఏదో చేస్తే ఇంకేదో అవుతుందా? అన్నది పక్కన పెడితే జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన మద్యం బాటిల్ పట్టుకుని యువతకు నోట్లో మందు పోస్తూ నత్యం చేస్తున్న దశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో హోలీ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మద్యం విక్రయాలను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. మహబూబాబాద్‌లో ఆ నిబంధన లేకపోవడంతో హోలీ వేడుకల కోసం ఎమ్మెల్యేను కలవడానికి వచ్చిన యువ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, యువతకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ మద్యం సీసాలతో స్వాగతం పలకడం చర్చనీయాంశమైంది. మద్యం బాటిళ్లతో ఎమ్మెల్యే నత్యాలు చేయడం జనాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. తెలంగాణ సంస్కతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలు చేసుకోవడం తప్పు కాదు కానీ బహిరంగంగా మద్యం సేవించడం, యువతకు మద్యం పోయడం పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తం అయ్యింది. ప్రజలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు యువతకు మద్యం తాగించడం సమంజసమేనా? అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినవస్తున్నాయి. హోలీ వేడుకల్లో మద్యం తాగి పలువురు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. మందు బాబులు వాహనాలు నడుపుతూ ఇతరుల చావులకు కారణమౌతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో మద్యం తాగడంపై ఆంక్షలు ఉన్నాయి. ఏది ఏమైనా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించాడు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అంటే అది ప్రభుత్వ కార్యాలయమే అన్నది జగమెరిగిన సత్యం. ఆ భవనాన్ని ప్రజాధనంతో ప్రభుత్వం నిర్మించిందన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో మద్యం సేవించడం, మందు సీసాలు ఉంచడం నిషేధమన్న విషయం తెలిసిందే. అయినా తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కార్యకర్తలకు మద్యం పోయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే.