Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హోలీ పండుగను వేడుకగా జరుపుకున్నారు. హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జయశంకర్, జనగామ జిల్లాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హోలీ జరుపుకున్నారు. హన్మకొండలోని కలెక్టరేట్లో వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, హన్మకొండ, ములుగు కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, క్రిష్ణ ఆదిత్య, అధికారులు, ప్రజాప్రతినిధులు సందడి చేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ా్యంప్ కార్యాలయంలో టీజీఓ, టీఎన్జీఓల సంఘం నాయకులు మీడియా ప్రతినిధులతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడారు. హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. రసాయనాలు లేని రంగులు ఉపయోగించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పోలీసు కమిషనర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీపీ డాక్టర్ తరుణ్ జోషికి రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, డీసీపీలు వెంకటలక్ష్మి, అశోక్‌కుమార్, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి, భీంరావు, సంజీవ్, ట్రైనీ ఐపిఎస్‌లు పంకజ్, సంకీర్త్, టిజిఓ ఉమ్మడి వరంగల్ అధ్యక్షులు జగన్ మోహన్‌రావు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.