Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి కళ్యాణం శుక్రవారం రాత్రి 10.38 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా హోళీ పర్వదినం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే హసన్‌పర్తి-భీమారం ఉమ్మడి గ్రామాల ఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి జాతర ఉత్సవాలు ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం మొదలయ్యాయి. ఇరు గ్రామాల నుంచి అలివేలు మంగమ్మ సమేత శ్రీనివాసుడి ఉత్సవ మూర్తుల ప్రతిమలు హసన్‌పర్తి నుంచి పెద్ద రథచక్రాల బండి మీద, భీమారం నుంచి చిన్న రథ చక్రాల బండి మీద ఎర్రగట్టు గుట్టకు చేర్చారు. అనంతరం ఆలయ ఈఓ కిషన్‌రావు, చైర్మెన్ చింతల లక్ష్మణ్‌యాదవ్ సమక్షంలో ఆలయ పూజారులు వేదాంతం పార్థసరాధాచార్యులు, ఆరుట్ల శ్రీధరాచార్యులు కళ్యాణ మండపంలో కళ్యాణం నిర్వహించారు. ఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి జాతర ఉత్సవాల్లో తొలి రోజు కళ్యాణం అనంతరం పెద్ద రథ చక్రాల బండ్లు ఊరేగింపుగా వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడంతో గోవింద నామ స్మరణతో మారుమోగాయి. ఇరు గ్రామాల నుంచి బయల్దేరిన అలివేలు మంగమ్మ శ్రీనివాస సమేత ఉత్సవమూర్తులకు భక్తులు ఆయా గ్రామాల్లో మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఆరెపల్లి సృజన శ్రావణ్, మడ్డి శ్రీనివాస్‌గౌడ, కాలువ శ్రీనివాస్‌యాదవ్, దేశిని భరత్‌గౌడ్, బూర శ్రీనివాస్‌గౌడ్, కంచర్ల త్యాగరాజు, వేదాంతం పార్థసారదాచార్యులు, ఆరుట్ల శ్రీనివాసచార్యులు, శ్రీధరాచార్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.