Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర పరిశీలన
నవతెలంగాణ-భూపాలపల్లి
నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు రానున్నారు. కాగా ఆదివారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 100పడకల ప్రభుత్వాసుపత్రిని ఆయన అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతరం నూతనంగా నిర్మించబోతున్న 50 పడకల ఆయుష్ ఆస్పత్రికి మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు ప్రసంగం చేయనున్నట్లు వివరించారు. అనంతరం జెన్కో కాన్ఫెరెన్స్హాల్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మంత్రి హరీష్‌రావుతోపాటు, రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర మహిళా-శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరవుతారని అన్నారు. మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.. మారుమూల కుగ్రామం గా ఉన్న భూపాలపల్లి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దినదిన అభివద్ధి చెందుతూ జిల్లా కేంద్రం గా ఏర్పడిందన్నారు. మంత్రి హరీష్ రావు చేతులమీదుగా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని ప్రారంభించడం సంతోషకరమైన విషయమన్నారు. సరిహద్దు జిల్లా అయిన తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీష్‌గఢ్ ప్రజలకు కూడా అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసే ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూపాలపల్లి కి మెడికల్ కాలేజ్ మంజూరు చేశారని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉండబోతుందని అప్పుడు మెడికల్ కాలేజీ నిర్మాణాలు కూడా శంకుస్థాపన చేసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. నేడు జరగబోయే బహిరంగ సభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ వెంకట రాణి సిద్ధూ, వైస్ చైర్మన్ కొత్త హరి బాబు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కటకం జనార్ధన్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బుర్ర రమేష్ గౌడ్, సాంబమూర్తి, పైడి పల్లి రమేష్, గడ్డం కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు.
నేడు మెడికల్ కళాశాలకు భూమి పూజ
మండలంలోని చెల్పూర్ శివారు వెయ్యి క్వాటర్స్ సమీపంలో మెడికల్ కళాశాల కోసం వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు భూమి పూజతోపాటు శంకుస్థాపన చేయను న్నారు. మంత్రి రాక నేపథ్యంలో అధికారులు, సంబంధిత పనులు చురుకుగా కొనసా గిస్తున్నారు. సంబంధిత భూమి ని కూడా అధికారులు కేటాయించారు. పలు సార్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. ఆది వారం శంకు స్థాపన కోసం శిలాఫలకాన్ని ఏర్పా టు చేశారు. ట్రాక్టర్లు,జేసీబీతో శుభ్రపర్చి సిద్ధం చేశారు. హరీష్‌రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జెడ్పీ ఛైర్పర్సన్, జయ శంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, భూపాలపల్లి జెడ్పీ చైర్‌ఫర్సన్ శ్రీహర్షిణి, తదితరులు హాజరుకానున్నారు.