Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్ని ప్రమాద బాధితులకు
- ఆదివాసీ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చేయూత
- ఒక్కో కుటుంబానికి నగదు, సరుకులు అందజేత
నవతెలంగాణ-మంగపేట
శనిగకుంట అగ్నిప్రమాద బాదిత కుటుంబాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీస్ ఆదివాసీ కోయ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 32 బాదిత కుటుంబాలకు రూ.5 వేలు చొప్పున నగదుతోపాటు నిత్యావసరాలు ఒక రోజు భఓజన వసతి ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ అద్యక్షుడు ఆలూరి ముత్తయ్య, ప్రధాన కార్యదర్శి సోయం ఓదెలు, ఉపాధ్యక్షుడు కొమురం రామారావు తెలిపారు. ఆదివారం గ్రామానికి చేరుకున్న అసోసియేషన్ సభ్యులు అగ్ని ప్రమాదం గురించి గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో కాలనీ మొత్తం కాలిపోవడం బాధాకరమన్నారు. అసోసియేషన్లోని 116 మంది సభ్యుల భాగస్వామ్యంతో లక్షా 66 వేల రూపాయలు సేకరించి ఒక్కో కుటుంబానికి రూ.5 వేలుతోపాటు సరుకులు అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో కల్తీ ఉపేందర్, బత్తుల సాంబయ్య, పాయం కాంతారావు, ఈసం భద్రయ్య, దనసరి సారంగపాణి, నల్లెబోయిన సాంబయ్య, గడ్డం లక్షమీపతి, చింత నారాయణ, కొక్కెర క్రాంతి పాల్గొన్నారు.