Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-హన్మకొండ
రాజకీయ పార్టీలకతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా తనను గెలిపించిన డివిజన్ ప్రజలకు సేవ చేయడంలో భాగంగా డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు తెలిపారు. ఆ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ఆదివారం శ్రీకారం చుట్టారు. అభివద్ధి కార్యక్రమంలో భాగంగా దుర్గాదేవి కాలనీ నుంచి సీఎస్ఆర్ జంక్షన్ వరకు మెయిన్ రోడ్లో ఇరువైపులా డ్రైనేజీ పనులను రూ.50 లక్షల ఖర్చుతో చేసే అభివద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం డివిజన్ పరిధిలోని బతుకమ్మ కుంట, రజక కులస్తుల స్మశాన వాటికకు రూ.5 లక్షల వ్యయం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను కార్పోరేటర్ గెలిచి ఏడాది పూర్తయిన క్రమంలో ఏడాదిలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నట్టు చెప్పారు. రాబోయే నాలుగేండ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా డివిజన్లో మురికి కాల్వలు, అంతర్గత రోడ్లు, స్మశాన వాటికలు, హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంచడం లాంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. డివిజన్లో ఏ సమస్య ఎదురైనా ఉన్నతాధికారులతో మాట్లాడి కాలనీలను పరిశుభ్రతతో డివిజన్ అభివద్ధి ధ్యేయంగా పని చేస్తానని చెప్పారు. కార్పొరేటర్‌గా ఏడాది పూర్తి చేసుకున్న మామిండ్ల రాజును కాలనీవాసులు సన్మానించారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు నీరటి ప్రభాకర్, కొల్లూరి భిక్షపతి, సారయ్య, శ్రీనివాస్, కాంట్రాక్టర్ లింగారావు, వర్కింగ్ ఇన్స్పెక్టర్ ఆకుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.