Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావు
నవతెలంగాణ-పాలకుర్తి
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా పాలకుర్తి లో ఏర్పాటుచేసిన ఫిజియోథెరపీ కేంద్రాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు అన్నారు. మండల కేంద్రంలో శ్రీ సోమేశ్వర ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఆదివారం మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ పాలకుర్తి మండల కేంద్రంలో ఫిజియోథెరఫీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ డం అభినందనీయమన్నారు. ప్రజలు జనగామ, హనుమకొండ ప్రాంతాలకు వెళ్లి ఫిజియోథెరఫీ చేయించుకునే వారని తెలిపారు. దీంతో ప్రజలపై అదనపు భారం పడే దని మండల కేంద్రంలో ఫిజియోథెరపీ కేంద్రం గ్రామీణ ప్రాంత ప్రజలకు వరంలాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగి రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్, ఫిజియోథెరఫీ నిర్వాహకులు డాక్టర్ రవి నాయక్, బానోతు సురేష్ నాయక్, ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మారుజోడు సంతోష్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, టీఆర్ఎస్ మండల సంయుక్త కార్యదర్శి దొంతమల్ల గణేష్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.