Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేవైఎం జిల్లా మాజీ అధ్యక్షుడు రవికిరణ్
నవతెలంగాణ-శాయంపేట
మన ఊరు మన బడి కార్యక్రమంలో తారాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, అధికారులను బీజేవైఎం జిల్లా మాజీ అధ్యక్షులు తాటికొండ రవికిరణ్ కోరారు. ఆ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తహారాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి పదో తరగతి వరకు 150 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. 105 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని, ఈ విషయాన్ని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. విద్యార్థుల సమస్యలను గుర్తించి సొంత ఖర్చులతో పారా టీచర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలోనైనా ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలని కోరారు. ఈ సమావేశంలో కో ఆప్షన్ సభ్యులు రేణుగుంట్ల కుమార్, బిజెపి మండల కోశాధికారి బండి వినోద్, శ్రీధర్, రవీందర్రెడ్డి, సారయ్య, సతీష్, ఎల్లగౌడ్, ప్రశాంత్ పాల్గొన్నారు.