Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
హైదరాబాద్ జీహెచ్ఎంసీలో డీఈఈగా పని చేస్తున్న ఇర్ప శ్రీనివాస్ భార్య సంజీవరాణి తన తోటి స్నేహితులతో కలిసి శనిగకుంట అగ్ని ప్రమాద బాదిత కుటుంబాలకు ఆది వారం దుస్తులు, నిత్యావసర సరుకులతోపాటు మహిళలకు రెండు జతల చీరలు, పురుషులకు రెండు జతల లుంగీలు, కండువాలు, ప్రతి కుటుంబానికి 20 లీటర్ల వాటర్ క్యాన్లను అందజేశారు. అగ్నిప్రమాదంలో ఆదివాసీ కుటుంబాలు రోడ్డున పడ్డ విషయాన్ని పత్రికల ద్వార తెలుసుకుని ఆమె చలించినట్టుతెలిపారు. తన భర్త శ్రీనివాస్, సోదరి స్వాతి భర్త రఘు (వ్యాపారవేత్త), స్నేహితులు మచ్చ శైలజ, చక్రవరిలతో కలిసి బాధిత కుటుంబాలకు సాయం అందజేశారు. ఈ సందర్బంగా సంజీవరాణి మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. శనగకుంట అగ్నిప్రమాద బాదితులతోపాటు మరో 18 ఆదివాసీ కుటుంబాలకు సైతం సాయం అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐటీడీఏ పేసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు.