Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి
నవతెలంగాణ-మహబూబాబాద్
పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి ఆదివారం సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈనెల 9, 10 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న క్రమంలో టీచింగ్ హాస్పిటల్‌కు భూమి పూజ చేస్తారని చెప్పారు. ఆసుపత్రి కూడా 350 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ అయిన సందర్భంగా ఇప్పటికే కొత్తగా ఉపయోగంలోకి వచ్చిన పడకలు, ఒక వైపు కోటీ 10 లక్షలతో నిర్మాణం చేసుకున్న 50 పడకలను, మరొకవైపు చిల్డ్రన్ ఐసీయూను, రేడియాలజి, సిటి స్కాన్‌కు సంబంధించిన వాటికి శంఖుస్థాపన చేస్తారని, వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకట్రాములు, వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ డిపోను లాభాల బాట పట్టించాలి
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోను లాభాల బాట పట్టించాలని కార్మికులను మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. రామగుండాల, ఇల్లందు బస్ సర్వీసును జెడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లతో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. తొలుత బస్ డిపోలో అన్ని విభాగాలను పరిశీలించారు. ఆర్టీసీ చైర్మెన్, ఎండీలతో ఫోన్లో పలు విషయాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మెన్ ఫరీద్, పీఏసీఎస్ చైర్మెన్ మూల మధుకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, కొమ్మినేని రవీందర్, యాళ్ల మురళీధర్‌రెడ్డి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.