Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణిసిద్దు
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చొరవ, మున్సిపల్ పాలకవర్గం సమన్వ యంతో చేస్తున్న అభివద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నా రని మున్సిపల్ చైర్మెన్ ఎస్ వెంకటరాణిసిద్దు అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లా డుతూ... భూపాలపల్లి ఎమ్మెల్యే మున్సిపాలిటీ నిధులను స్వాహా చేశారంటూ కాంగ్రెస్ పార్టీ భూపా లపల్లి నాయకులు గండ్ర సత్యనారాయణరావు ఆరో పించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే భూపా లపల్లి పట్టణ ప్రాంత ప్రజల కోసం ప్రణాళిక బద్దంగా పనిచేస్తున్నాడని అన్నారు. భూపాలపల్లి పట్టణ ప్రజలకు విద్యార్థులకు సింగరేణి కార్మికులకు ఉపయోగంలోకి తీసుకురావాలని సుభాష్ కాలనీ సమీపంలో సుమారు 5 ఎకరాల్లో రూ.79 లక్షలతో డిగ్రీ కాలేజీకి పిల్లింగ్ చేయించామన్నారు. సుమరు రూ.కోటితో సిమ్మింగ్పూల్ పనులు జరుగుతున్నా యన్నారు. రూ.4.50కోట్లతో మినీ స్టేడియం మంజూరైందని అన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వెంచర్ల లో పార్కులకు రూ.40లక్షలు కేటాయిం చారని ఆరోపించడం సరికాదన్నారు. జీఎంఆర్ వెంచర్ల లోనే కాకుండా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో లేఅవుట్ వెంచర్లు చేసిన వారు మున్సి పాలిటీ10శాతం స్థలం కేటాయించడం జరుగుతుం దన్నారు. ఇందులో మునిసిపల్ నిధులతో పార్కులకు నిధులు కేటాయించి అభివద్ధి చేయడం జరుగు తుందని అన్నారు. ఆద్య డెవలపర్ వెంచర్స్‌లో కూడా రూ.40లక్షలు పార్కు అభివద్ధికి కేటాయించి నట్టు తెలిపారు. మంత్రి కేటీఆర్ భూపాలపల్లిలో పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన లూ ప్రారం భోత్సవాలు చేయుటకు వస్తున్న సందర్భంగా అధికారిక కార్యక్రమాలకు మున్సిపల్ నిధులు కేటా యించామన్నారు. వీటిపై అవగాహన లేక ఎమ్మెల్యేపై చౌక బారు మాటలు మాట్లాడితే ఊరుకో బోమని హెచ్చరించారు. సత్యనారాయణ రావుకు ప్రజలకు ఉపయోగపడే అభివద్ధి పనుల గురించి తెలియదని అన్నారు. మీ వ్యక్తిత్వాన్ని బట్టే కాంగ్రెస్ కార్యకర్తలు సత్యనారాయణరావును వ్యతిరేకిస్తున్నార న్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లుముంజల రవీందర్, పిల్లలమర్రి శారద నారాయణ,చల్ల రేణుక, ఆకు దారి మమతా రాయమల్లు,ఎడ్ల మౌనిక శ్రీనివాస్, టీఆర్ఎస్ అర్బన్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, బీబీ చారి, టీఆర్ఎస్ నాయకులు ఇర్ఫాన్, ఐలయ్య, మేడం రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.