Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
దళిత బంధు పథకం నెరవేరుతుందో? వస్తుందో రాదో? అని ఎదురు చూస్తున్నా లబ్ధిదారులకు శుక్రవారం పండుగ వాతావరణంలో సంబరాలు అంబరా న్నంటాయి. 25 మంది లబ్ధిదారులకు ఆస్తుల పంపకం నిర్వహించారు. జిల్లా షెడ్యూల్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో గీసుగొండ, సంగెం మండలాల దళితబంధు లబ్ధిదా రులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం గీసు గొండలో జరిగింది. పరకాల ఎమ్లెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ బి గోపి హాజరయ్యారు. సంగెం మండలం నుండి 13 మంది, గీసుగొండ మండలం నుండి 12 మంది లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేశారు. జెడ్పీటీసీ ధర్మారావు, సంగెం ఎంపీపీ కందగట్ల కళావతి, సర్పంచ్ గుండేటి బాబు, రైతుబంధు సమన్వయ కమిటీ కన్వీనర్ కందగట్ల నరహరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, బంధు కన్వీనర్ బొమ్మల శంకర్, జాగతి అధ్యక్షులు యార బాలకష్ణ, సొసైటీ చైర్మన్లు తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.