Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ స్పష్టం
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ హించేందుకు సిద్ధంగా ఉన్నామని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అఖిలపక్ష నేతలతో, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోసం ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేశామని చెప్పారు. జనగామ జిల్లాలో తొమ్మిది గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, అందులో బచ్చన్నపేట 1, దేవరుప్పుల 3, స్టేషన్గన్పూర్ 2, జనగామ 1, పాలకుర్తి ఒకటి రఘునాథపల్లి-1 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. అలాగే 53 వార్డు సభ్యు లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని ఎన్నికల నిర్వహణ కోసం 87 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశామని చెప్పారు. ఈ ఎన్నికల్లో 8497 మంది స్త్రీలు, 8426 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని పేర్కొ న్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి రంగాచారితో పాటు టీఆర్ఎస్ తరపున రవి, కాంగ్రెస్ తరపున బక్క శీను, సీపీఐ చొప్పరి సోమయ్య, బిజెపి తరఫున శివరాజ్, సీపీఐ(ఎం) తరపున జోగు ప్రకాష్, వైఎస్సార్సీపీ తరఫున వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.