Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ఈజీఎస్ పనులను ప్రతి ఉపాధి హామీ కూలి సద్వి నియోగం చేసుకోవాలని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వీరమనేని యాకాంతారావు అన్నారు. శుక్రవారం పాలకుర్తిలో ఉపాధి హామీ లో చేపట్టిన ఫార్మేషన్ రోడ్డు పనులను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇబ్బం దులను తొలగించేందుకు ప్రజలు రైతుల సౌకర్యార్థం ఉపాధి హామీలో ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కమ్మగాని (గూన) సోమయ్య బావి వద్ద నుండి ఎడవెల్లి (గంపల) సోమ్మలు దొడ్డి వరకు ఫార్మేషన్ రోడ్డును నిర్మిస్తామన్నారు. ఫార్మేషన్ రోడ్డు నిర్మాణ పనులను కూలీలు సద్వినియోగం చేసుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎడవెల్లి పురుషోత్తం, వార్డు సభ్యులు కమ్మగాని మంజుల మధు, కమ్మగాని కుమారస్వామి, కష్ణమూర్తి, కమ్మగాని (గూన) వెంకన్న, వడ్లకొండ యాదగిరి, లక్ష్మయ్య, దేశ బోయిన అశోక్, ఎండి యాకుబ్, పరంజ్యోతి పాల్గొన్నారు.