Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఏనుమాములలో రోడ్ల విస్తరణకు మార్కింగ్ చేస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులను శుక్రవారం కొంతమంది ఇండ్ల యజమానులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఏనుమాముల గ్రామపంచాయతీ వైపు రోడ్డును 30 సీట్ల వెడల్పు చేయాలని గత సోమవారం తాము గ్రీవెన్స్ సెల్ లో మున్సిపల్ కమిషనర్ కు విన్నవించామన్నారు. ఆమె ఆదేశాలతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, డీఆర్ఎఫ్ బందాలతో వచ్చి రోడ్డు విస్తరణకు మార్కింగ్ చేస్తుండగా కొంతమంది ఇండ్ల యజమానులు తమ కాంపౌండ్ వాల్స్ పోతున్నాయని మార్కింగ్‌ను అడ్డుకున్నట్లు తెలిపారు. 40 ఫీట్లు ఉండాల్సిన రోడ్డును ఆక్రమిం చారని, ఇప్పుడు కనీసం ముప్పై ఫీట్ల వెడల్పు కూడా సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా రాబోవు తరాలను దష్టిలో పెట్టుకుని 30ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు.