Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
రేగొండ మండలాన్ని నేర రహిత మండలంగా తీర్చిదిద్దడమే పోలీసుల లక్ష్యమని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గాంధీ నగర్ గ్రామంలో మేము సైతం కార్యక్రమం నిర్వ హించిన ఆయన మాట్లాడారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు వ్యా పారస్తులు విరాళాలు అందజేసి సహకరించాలని అన్నారు. నేరాలను అదుపులో ఉంచేందుకు దొంగ తనాల అరికట్టేందుకు సీసీ కెమెరాలు దోహద పడతాయన్నారు. గ్రామాలకు అనుమానిత వ్యక్తుల వస్తే గుర్తించొచ్చన్నారు. త్వరలోనే విరాళాలతో గ్రామ కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం సర్పంచ్‌కు రూ.2వేల విరా ళాన్ని అందజేశారు. అలాగే గ్రామ సర్పంచ్ సంతోష్ రూ.10వేల విరాళాన్ని ఎస్సైకి అదజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, గ్రామస్థులు, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.