Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనుల ఆందోళన
నవతెలంగాణ-మల్హర్రావు
సర్వం కోల్పోయి రోడ్డున పడిన తమకు అన్యాయం చేయొద్దని ఆదివాసీ గిరిజన, నాయకపోడు కాపురం గ్రామ నిర్వాసితులు అధికారులను వేడుకొంటున్నారు. అన్నివిధాలా అర్హత ఉన్న తమ పేర్లు ప్రభుత్వం ప్రకటించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజి జాబితాలో రాలేదని శుక్రవారం భూపాలపల్లి జిల్లా నాయకపోడు సంక్షేమ సంఘం అధ్యక్షుడు శీలం లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ... 2017 కటాఫ్ డేట్ పెట్టి ఇండ్లకు నష్టపరిహారం ఇచ్చిన వేంటనే ఆర్అండ్ఆర్ ప్యాకేజి, పునరావాసం కల్పించకుండా జెన్కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఇప్పుడు అర్హులైన యువతకు అన్యాయం చేయదం తగదన్నారు. తాము ఏండ్లుగా అడవిని నమ్ముకుని జీవిస్తున్న క్రమంలో తమ ఇండ్లను తీసుకొని పరిహారం ఇచ్చి ప్యాకేజి ఇవ్వడంలో అన్యాయం చేసి తమ బతుకులు రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకుంటే ఆందోళన ఉదతం చేస్తామని హెచ్చరించారు.